అతిరథ మహారధులు


అతిరథ మహారధులు

ఎవరు వాళ్ళు?

అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం. అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం మనకు అర్థమవుతుంది. అయితే ఆ పదాలకు సరైన అర్థం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. మహామహా గొప్పవాళ్ళు వచ్చారనే అర్థంలో వాడతామనేది అందరికీ తెలుసు. ఆ పదాలకు అర్థాలేమిటో చూద్దాం.

యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి.

ఇందులో 5 స్థాయులున్నాయి. అవి –

రథి, అతిరథి, మహారథి, అతి మహారథి, మహామహారథి.

1) రథి – ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలడు.

సోమదత్తుడు, సుదక్షిణ, శకుని, శిశుపాల, ఉత్తర, కౌరవుల్లో 96మంది, శిఖండి, ఉత్తమౌజులు, ద్రౌపది కొడుకులు –
వీరంతా రథులు.

2) అతి రథి (రథికి 12రెట్లు) –

60,000మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.

లవకుశులు, కృతవర్మ, శల్య, కృపాచార్య, భూరిశ్రవ, ద్రుపద, యుయుత్సు, విరాట, అకంపన, సాత్యకి, దృష్టద్యుమ్న, కుంతిభోజ, ఘటోత్కచ, ప్రహస్త, అంగద, దుర్యోధన, జయద్రథ, దుశ్శాసన, వికర్ణ, విరాట, యుధిష్ఠిర, నకుల, సహదేవ, ప్రద్యుమ్నులు అతిరథులు.

3) మహారథి (అతిరథికి 12రెట్లు) –

7,20,000 మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.

రాముడు, కృష్ణుడు, అభిమన్యుడు, వాలి, అంగద, అశ్వత్థామ, అతికాయ, భీమ, కర్ణ, అర్జున, భీష్మ, ద్రోణ, కుంభకర్ణ, సుగ్రీవ, జాంబవంత, రావణ, భగదత్త, నరకాసుర, లక్ష్మణ, బలరామ, జరాసంధులు మహారథులు.

4) అతి మహారథి (మహారథికి 12రెట్లు) –

86,40,000 (ఎనభై ఆరు లక్షల నలభైవేలు) మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు.

ఇంద్రజిత్తు, పరశురాముడు, ఆంజనేయుడు, వీరభద్రుడు, భైరవుడు – వీరు అతి మహారథులు.

రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతి మహారథులు, అటు ఇంద్రజిత్తు – ఇటు ఆంజనేయుడు. రామలక్ష్మణ రావణ కుంభకర్ణులు మహారథులు మాత్రమే.

5) మహామహారథి (అతిమహారథికి 24రెట్లు) –

ఏకకాలంలో 207,360,000
(ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేలు) మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలడు.

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, దుర్గా దేవి, గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి, వీరు మహామహారథులు.

మహామహారథులలో అమ్మవారు కూడా ఉండడం హిందూ ధర్మంలోనున్న మహిళా సాధికారతకు నిదర్శనం. మహిళ యుద్ధంలో పాల్గొన్న సంగతే ఇతర మతాల్లో మనకు కనిపించదు. అలాంటిది, ఒక మహిళయైన దుర్గా దేవి ఏకంగా ఇరవైకోట్ల మంది కంటే ఎక్కువ మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్టుగా గుర్తించడం మామూలు విషయం కాదు. సేకరణ రామాయణం సత్యనారాయణ శర్మ విజయనగరం కార్యదర్శి .

రచయిత:

http://jaitelugutallitv.com/ marajosarma.blogspot.in kamyasiddhi.wordpress.com facebook:MAVUDURU RAMAJOGESWARA SARMA YOUTUBE CHANNEL: MAVUDURU RAMAJOGESWARA SARMA

వ్యాఖ్యానించండి