పాట


🌹 అమరులైన
భారత వీరులకు నివాళిగా.. 🌹

పాట: నేను.. నా దేశం
చిత్రం : నేను నా దేశం (1974)
సంగీతం : సత్యం
గీతరచయిత : అంకిశ్రీ
నేపధ్య గానం : బాలు, సుశీల

❄❄

పల్లవి :

నేను నా దేశం పవిత్ర భారత దేశం
సాటి లేనిది దీటురానిది శాంతికి నిలయం మనదేశం

నేను నా దేశం పవిత్ర భారత దేశం
సాటి లేనిది దీటురానిది శాంతికి నిలయం మనదేశం

నేను నా దేశం పవిత్ర భారత దేశం

🥦🥦

చరణం 1 :

అశోకుడేలిన ధర్మ ప్రదేశం… బుద్ధుడు వెలసిన శాంతి దేశం
బుద్ధం శరణం గచ్ఛామి…
ధర్మం శరణం గచ్ఛామి…
సంఘం శరణం గచ్ఛామి…
అశోకుడేలిన ధర్మ ప్రదేశం
బుద్ధుడు వెలసిన శాంతి దేశం
కులమత భేదం మాపిన త్యాగి
అమర బాపూజి వెలసిన దేశం
వందేమాతరం… వందేమాతరం… వందేమాతరం
కులమత భేదం మాపిన త్యాగి
అమర బాపూజి వెలసిన దేశం

నేను నా దేశం పవిత్ర భారత దేశం

🌿🌿

చరణం 2 :

కదం త్రొక్కిన వీర శివాజి… వీర శివాజి
వీర విహారిణి ఝాన్సీరాణి… ఝాన్సీరాణి
స్వరాజ్య సమరుడు అల నేతాజి…

జైహింద్… జైహింద్… జైహింద్

స్వరాజ్య సమరుడు అల నేతాజి
కట్టబ్రహ్మన పుట్టిన దేశం
నేను నా దేశం పవిత్ర భారత దేశం

🌼🌼

చరణం 3:

ఆజాద్.. గోఖలే.. వల్లభాయ్.. పటేల్ ..లజపతి.. తిలక్.. నౌరోజీలు
ఆజాద్.. గోఖలే.. వల్లభాయ్.. పటేల్.. లజపతి.. తిలక్.. నౌరోజీలు
అంబులు కురిపిన మన అల్లూరి
అంబులు కురిపిన మన అల్లూరి
భగత్ రక్తము చిందిన దేశం
హిందూస్తాన్ హమారా హై… హిందూస్తాన్ హమారా హై
నేను నా దేశం పవిత్ర భారత దేశం

🌸🌸

చరణం 4 :

గుండ్ల తుపాకి చూపిన దొరలకు
గుండె చూపే మన ఆంధ్రకేసరి… మన ఆంధ్రకేసరి
శాంతి దూత మన జవహర్ నెహ్రు
శాంతి … శాంతి… శాంతి
శాంతి దూత మన జవహర్ నెహ్రు
లాలబహుదూర్ జన్మించిన దేశం
జై జవాన్ జై కిసాన్… జై జవాన్ జై కిసాన్… జై జవాన్ జై కిసాన్
నేను నా దేశం పవిత్ర భారత దేశం

🍂🍂

చరణం 5 :

అదిగో స్వరాజ్య రధాన సారధి
అదిగో స్వరాజ్య రధాన సారధి
స్వరాజ్య రధాన సారధి
ఆదర్శనారి ఇందిరాగాంధీ
ఘరీబి హటావో… ఘరీబి హటావో
ఆదర్శనారి ఇందిరాగాంధీ
అడుగు జాడలో పయనిద్దాం
అఖండ విజయం సాధిదాం
అడుగు జాడలో పయనిద్దాం
అఖండ విజయం సాధిదాం

నేను నా దేశం పవిత్ర భారత దేశం
సాటిలేని ధీటు రానిది
శాంతికి నిలయం మన దేశం
నేను నా దేశం నేను నా దేశం నేను నా దేశం

🌹 అమరులైన భారత
వీరులకు నివాళిగా…🌹

🌷🌷

పాట: జగతి సిగలో జాబిలమ్మకు వందనం
చిత్రం: పరదేశి
గానం: సుజాత
సాహిత్యం: వేటూరి
సంగీతం: కీరవాణి

🌻🌻

పల్లవి:

ఆ….

India The Beautiful India

జగతి సిగలో జాబిలమ్మకు వందనం
వందనం…
మమతలెరిగిన మాతృభూమికి మంగళం
మాతరం..
మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరి
కలికి పదములు కడలి కడిగిన కళ ఇదీ
ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా
ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా

🍂🍂

చరణం 1:

గంగ యమునలు సంగమించిన గానమో
సనిసగస మపపదప నిసరిమపా
కూచిపూడికి కులుకు నేర్పిన నాట్యమో
పమరిస రిమపని సరినిసదపా
అజంతాల ఖజురహోల
సంపదలతో సొంపులొలికే భారతీ జయహో..ఓ …
మంగళం … మాతరం
ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా
ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా

జగతి సిగలో జాబిలమ్మకు వందనం
వందనం…వందనం

🌿🌿

చరణం 2:

మపససాసస దానిపా గామపా దానిపా
సససరిసరిపగా సససరినీపగా
తాజ్ మహలే ప్రణయ జీవుల పావురం
తన్నానె తానెనాన తన్నానె తానెనాన
కృష్ణవేణీ శిల్పరమణీ నర్తనం
తన్నానెనా తననానేనా
వివిధ జాతుల… వివిధ మతముల..
ఎదలు మీటిన ఏకతాళపు భారతీ జయహో..ఓ …
మంగళం … మాతరం
ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా
ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా

జగతి సిగలో జాబిలమ్మకు వందనం
వందనం…
మమతలెరిగిన
మాతృభూమికి మంగళం
మాతరం..
వందే మాతరం….

🌹🌹

🌹 అమరులైన
భారత వీరులకు నివాళిగా..🌹

పాట: జయ జయ జయ ప్రియభారత
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: జానకి
చిత్రం: రాక్షసుడు
సంగీతం: ఇళయరాజా

💐💐

పల్లవి:

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి ||జయ..జయ

🌼🌼

జయ జయ సుస్యామల , సుశ్యామ చలచ్చేలాంచల
జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా ||జయ..జయ

🌸🌸

జయ దిశాంత గత శకుంత , దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక , గళ విశాల పద విహరణ
జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణ ||జయ..జయ

🌹🌹

🌷 శుభోదయం 🌷

పాట: అణువు అణువున వెలసిన దేవా
చిత్రం : మానవుడు-దానవుడు (1972)
సంగీతం : అశ్వద్దామ
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు

💐💐

పల్లవి:

అణువు అణువున వెలసిన దేవా
కనువెలుగై మము నడిపించరావా
అణువును అణువున వెలసిన దేవా

🌸🌸

చరణం 1:

మనిషిని మనిషే కరిచే వేళ
ద్వేషం విషమై కురిసే వేళ
నిప్పుని మింగి నిజమును తెలిపి
చల్లని మమతల సుధలను చిలికి
అమరజీవులై వెలిగిన మూర్తుల
ఆ….ఆ….ఆ….ఆ….ఆ…ఆ…
ఆ…..ఆ…..ఆ…..ఆ….ఆ…
అమరజీవులై వెలిగిన మూర్తుల
అమృతగుణం మాకందించ రావా
అమృతగుణం మాకందించ రావా

అణువును అణువున వెలసిన దేవా
కనువెలుగై మము నడిపించ రావా
అణువును అణువున వెలసిన దేవా

🌼🌼

చరణం 2:

జాతికి గ్రహణం పట్టిన వేళ
మాతృ భూమి మొరపెట్టిన వేళ
స్వరాజ్య సమరం సాగించి
స్వాతంత్ర్య ఫలమును సాధించి
ధన్య చరితులై వెలిగిన మూర్తుల
ఆ….ఆ….ఆ…ఆ…ఆ…
ఆ…..ఆ…..ఆ….ఆ…ఆ…
ధన్య చరితులై వెలిగిన మూర్తుల
త్యాగ నిరతి మా కందించ రావా
త్యాగ నిరతి మా కందించ రావా

అణువు అణువున వెలసిన దేవా
కను వెలుగై నడిపించ రావా
అణువు అణువున వెలసిన దేవా

🍂🍂

చరణం 3:

వ్యాధులు బాధలు ముసిరే వేళ
మృత్యువు కోరలు చాచే వేళ
గుండెకు బదులుగ గుండెను పొదిగీ
కొన ఊపిరులకు ఊపిరిలూదీ
జీవన దాతలై వెలిగిన మూర్తుల
ఆ….ఆ….ఆ….ఆ….ఆ…ఆ…
ఆ….ఆ….ఆ….ఆ….ఆ…..ఆ…
జీవన దాతలై వెలిగిన మూర్తుల
సేవాగుణం మాకందించ రావా
సేవా గుణం మాకందించ రావా

అణువు అణువున
వెలసిన దేవా
కనువెలుగై మము నడిపించరావా
అణువు అణువున వెలసిన దేవా..

🌷🌷

శ్రీ ఘంటసాల వారు స్వీయ సంగీత దర్శకత్వం లో పాడిన ఈ దేశభక్తి గీతం మీకోసం..

💐💐

మూలం: దేశ భక్తి గీతం
రచన: తోలేటి
సంగీతం: ఘంటసాల
గానం: ఘంటసాల

🌻🌻

పల్లవి:
స్వాతంత్ర్యమె మా జన్మ హక్కని చాటండి..(2)
నిరంకుశంబగు శక్తులెదిరినా నిర్భయముగ నిదురించండి (2)
పరుల దాస్యమున బాధలు పొంది బ్రతికిన చచ్చిన భేదమె లేదు (2)

స్వాతంత్ర్యమె మా జన్మ హక్కని చాటండీ

🌿🌿

కవోష్ణ రుధిర జ్వాలలతోటీ… ఈ..ఈ..
కవోష్ణ రుధిర జ్వాలలతోటీ స్వతంత్ర్య సమరం నెరపండి (2)
ఎంతకాలమిటు సహించియున్నా, దోపిడిమూకకు దయరాదన్నా! (2)

స్వాతంత్ర్యమె మా జన్మ హక్కని చాటండీ..ఈ..ఈ..

🌹🌹

సంఘములోను ఐక్యత వేగమె సంఘట పరుచుము శాంతిపథానా..ఆ…
సంఘములోను ఐక్యత వేగమె సంఘట పరుచుము శాంతిపథాన
స్వర్గతుల్యమౌ స్వతంత్ర జ్యోతికీ..ఈ..ఈ..
స్వర్గతుల్యమౌ స్వతంత్ర జ్యోతికి మాంగల్యపు హారతులిమ్మా!
మాంగల్యపు హారతులిమ్మా!

స్వాతంత్ర్యమె మా జన్మ హక్కని చాటండి..(2)

🌻🌻