మాటల మధురిమ


🌻అతిసర్వత్ర వర్జియేత్

🌻అతిసర్వత్ర వర్జియేత్🌻

ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితురార్జితం !
అధమం భ్రాత్రువిత్తంచ స్త్రీవిత్త మధమాధమమ్ !!

తాత్పర్యం:
తను సంపాదించిన ధనం ఖర్చుపెట్టడం ఉత్తమం, తండ్రి సంపాదించిన ధనాన్ని ఖర్చు చేయడం మధ్యమం, తోబుట్టు ధనాన్ని ఖర్చుచేయడం అధమము. ఇక స్త్రీలకు సంబందించిన ధనాన్ని (పుట్టినింటి వారు ఇచ్చినధనం కావచ్చు లేదా తను సంపాదించిన ధనం కావచ్చు) తీసుకుని ఖర్చు చేయటం అన్నిటికంటే అధమాతి అధమం అంటే స్త్రీలకు సంబందించిన ధనం వారికే చెందజేయాలని అర్థం.

మరో రకంగా చెప్పుకోవాలంటే వీటిని ప్రాదాన్యతాక్రమంగా చెప్పుకొని గత్యంతరం లేని పరిస్థితిలో తప్ప ఆడవారికి సంబందించిన ధనాన్ని ముట్టుకోవద్దని భావం.

శుభోదయం

పునర్విత్తం పునర్మిత్రం
పునర్భార్య పునర్మహి
ఏతత్సర్వంపునర్లభ్యం
న శరీరం పునఃపునః।।

భావం:
పోయిన ధనాన్ని మళ్లీ సంపాదించుకోవచ్చు.దూరమైన మిత్రుడు చేరువకావచ్చు. భార్య గతిస్తే మరొక భార్య లభించవచ్చు. భూసంపద మళ్లీ ప్రాప్తిస్తుంది.
పోయినవన్నీ మళ్లీ తిరిగి రాబట్టుకోవచ్చు!
కాని శరీరం మాత్రం మళ్లీ మళ్లీ రాదు.
అందుకే దండి దశకుమారచరిత్రలో ఒక దగ్గర ఇలా అంటాడు.
శరీరమాద్యంఖలుధర్మసాధనం.
ధర్మ,అర్థ,కామ,మోక్షములనే
చతుర్విధ పురుషార్థములకు
శరీరమే ప్రధానం
కనుక శరీరము ను పరిరక్షించుకొనుట
అత్యంత ఆవశ్యకము.

జంతువులకు శరీరం ఉంటుంది కాని వాటికి ఆలోచన ఉండదు.
పైగా ఆలోచన కలిగినా దాన్ని అమలు చేయడానికి శరీరం సహకరించదు.

బుద్ధి , ఆలోచన ఉండేది మనుష్యులకే. వాటిని అమలు చేసే నైపుణ్యమూ మనుష్యులకే ఉంటుంది. కనుక మన శరీరాన్ని కాపాడుకోవాలి*. అతిగా తిన్నా, అతిగా ఆలోచించినా, అతిగా సుఖం కలిగించినా,
అతిగా దుఃఖం కలిగించినా
ఏదైనా అతిగా చేసిన యెడల శరీరానికి
శ్రేయస్సును ఇవ్వదు.
కనుక ముందు శరీరము ను జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలను పాటించడమే గొప్పదైన ఔషధంగా చెప్పవచ్చు.
మీ
జోస్యులహరిప్రసాద్