Padyaratnalu-పద్యరత్నాలు


🙏సైనిక సప్తపది🙏

🇳🇪సైనిక సప్తపది🇳🇪
ఆ.వె.దేహమందు ప్రేమ దేశాన ప్రేమగా
మలచుకొన్నయట్టి మహితుడతడు
దేశమాత రక్ష దేవకార్యమ్ముగా
సలుపునట్టి ఘనుడు సైనికుండు.
తే.గీ.తల్లి దండ్రుల దీవెనల్ తలను దాల్చి
భార్య ప్రేమను ఎదనిండ పదిల పరచి
పిల్లపాపల నింటిలో విడిచిపెట్టి
అడుగు ముందుకు వేసెడి హరుడతండు.
ఆ.వె.భార్య నుండి వచ్చు వార్తలకోసమై
ఎదురు చూడడతడు యెన్నడైన
గుండెలోన పలుకు గుసగుసల్ వినుచుండు
గుట్టు గానె ప్రేమ గుట్ట పోయు.
ఆ.వె.చిన్ని పాప పిలుపు విన్నట్టి భావనన్
పెదవిపైన నవ్వు వెల్లివిరియు
ఇంతలో తుపాకి యేమంచు పిలుచునో
కన్నులెఱ్ఱజేయు మిన్ను చూచు.
ఆ.వె.మండుటెండలోన కొండకోనలయందు
ఎముక కొఱుకునట్టి హిమమునందు
ఒంటిదారులందు నొండొరుల తోడుగా
దేశ సేవజేసి తృప్తి జెందు.
ఆ.వె.నాన్న పెట్టె నిండ నాకేమి తెచ్చునో
యనుచు నెదురుచూచు నతని సంతు
ఆశ జూచు నెడద నశనిపాతమ్ముగా
కన్నుమూసి పెట్టె నాన్న దెచ్చు.
ఆ.వె.మాతృదుఃఖమింత మాన్పగా తరమౌనె
మాతృభూమిసేవ మాట తప్ప
ఎదను రగులు మంట లెవ్వ రార్పగసాధ్య
మతని జయము తప్ప యశము తప్ప.
🙏కర్తవ్యం🙏
ఉ. ధీనిధులార!మేల్కొనుడు. దేశము లోన విరోధి సంఘముల్
మానవ ధర్మమున్ మరచి మారణ హోమము సల్పు చుండగా
ప్రాణ సమానదేశమును ప్రాణము లిచ్చియె గాచుకోవలెన్
ఐనవి పద్యసంబరము లందఱు లెండహొ దేశ రక్షకై.
…మావుడూరు సూర్య నారాయణ మూర్తి. భాగ్యనగర్

భరతమాత

సీ. ఏమాతృపదసీమ నిహపరమ్ముల సంధ్య
భూపాల రాగమై పొల్చుచుండు
ఏమాతృవదనమ్ము యీదేశవాసుల
మోమున చిరునవ్వు మొలయజేయు
ఏమాతృ గర్భాన ఎనలేనిరత్నాలు
పుంఖానుపుంఖాలు పుట్టుచుండు
ఏమాతృగృహసీమనీశుండు రక్తితో
నవతారములనందు నఘము బాప
తే.గీ. దైవముండుట తొలిసారి తలచి నట్టి
జాతి భాసింపగాజేయు జ్ఞానదీప్తి
రాష్ట్రజనత వందేమాతరమ్మనంగ
కరము దీవించు భరతాంబ కాళికాంబ!!🙏

రచనః మావుడూరు సూర్య నారాయణ మూర్తి. సాహితివెత్త, హైదరాబాద్, సెల్ః 98498 55983

[10/20/2018, 12:27 AM] MAHENDRADA: తితిలీ వాతలు

ఉత్తరాంధ్రకు నిత్యాలు-
ఉతికి ఆరేస్తున్న తుపానులు-

మట్టిని నమ్ముకున్న రైతులు-
పగలూ రేయి కష్టించినా శేషంగా శూన్య ఫలాలు-

తీరాల్లో ఉప్పు గల్లీలు-
నీరై పొర్లే సమతా సాగరాలు-

కాపు కాసే చెట్లు-
కూకటి వ్రేళ్ళ తో నేల పాలు-
సకల జీవుల ప్రాణాలు-
బితుకు బితుకు మంటున్న స్సమయాలు-

చెట్లపై పలురకాల పక్షులు-
కొన్నివిగత జీవులు-

సకల విజ్ఞాన దర్శనాలు-
సరస్వతీ నిలయాలు-
నిండుదనాన్ని కోల్పోయిన ఎడారులు-

సముద్రాన్ని నమ్ముకున్న వారి గృహాలు-
ఉప్పు సంద్రం పాలు-

తితిలీ తోనూ నేర్చుకున్నాం పాఠాలు-
కలలో కూడా మరువలేము
భీషణ వాతూల శబ్ద ఘోషలు-

( *మహేంద్రాడ సింహాచలాచార్య
టెక్కలి )
[12/6/2018, 6:08 PM] MAHENDRADA: ♨ అగ్గిపుల్ల

నిన్నటి దినం
నిప్పంటుకొని
నిబ్బరంగా
కాలుతూనే వుంది…
నేడైనా
ఆర్పేస్తివా సరే…
లేకుంటే
నిన్నూ నన్నే కాదు
ఈ ప్రపంచాన్నే
దహించేస్తుంది..
నీవు ముట్టించి విసిరిన
మతం అగ్గిపుల్ల

మహేంద్రాడ సింహాచలాచార్య- టెక్కలి
[1/30, 10:07 PM] MAHENDRADA: 🙏🌷🙏శ్రీ మహాత్మా గాంధీ గారి వర్ధంతి(జనవరి -30 ) 🙏🌷🙏

సీ. ” సత్య ధాత్రి” ని గోరి శాంతి మార్గమునందు
నడచినట్టి మహాత్మ ! నతులు నీకు !

 నిత్యమహింసతో  నిజనేతవై నట్టి 
             *'బాపూజి*' ! నీకివే భవ్యనతులు !

భారత దేశమే ప్రథమ హారతు లీయ!
               బారిష్టరైనావు!    ప్రాజ్ఞ నతులు !

 వందేళ్ళ  కొకసారి వసుధలో  ఒక్కడై
             పుట్టవా !గాంధీజి ! పుడమి గాచ

ఆ.వె. మరల జనన మంది మాలోని శాంతి నే –

   పాదు గొల్పు నీవు పావనముగ -

   భరత జాతియందు భాగ్యోదయంబునే -

    గలుగ జేయవయ్య! గాంధి ! తాత !...🙏🌷🙏

మహేంద్రాడ సింహాచలాచార్య (టెక్కలి )🌹🙏🌹

చలిత మానసం

పొంగులువారు ప్రాయమున పూపొదరిండ్లను దూరిదూరి యే
కొంగుననైన గుండియల గూరిమి నించెడు రాగధూళి స
త్సంగతి నందలేక యొక చాటున నొంటిగ వెళ్ళబుచ్చు నీ
భృంగము, దీని ముంగిటిటు పిల్వక పూచెదవేల పుష్పమా!

రంగు రేకుల తమయంతరంగములను
కమ్మతావుల తమ మనోగాఢతలను
దాచి మురిపించి బులిపించు తరుణవతుల
నమ్మబోకమ్మ తుమ్మెదా రెమ్మ విరుల!