Vedism-వైదికం



దుర్ముహూర్తం అంటే ఏమిటీ? ఎలా ఏర్పడుతుంది?

Chinta Gopi Sarma:

మానవ నిత్య జీవితంలో ఎన్నో సంస్కారాలు చేయాల్సి ఉంటుంది. వాటి నిర్వహణకు శుభ ముహూర్తాలు అవసరమవుతాయి. అయితే శుభ ముహూర్తాలతో పాటు దుర్మూహూర్తాలపై కూడా అవగాహన ఉండాలి. అప్పుడే మనం మంచి ముహూర్తమేంటో అర్థం చేసుకోగలము.

నక్షత్ర ప్రమాణమును బట్టి విడువ తగిన కాలమును వర్జ్యం అంటారు. దినప్రమాణమును బట్టి, వారమును బట్టి విడువ తగిన కాలమును దుర్మూహుర్తం, రాహూకాలము అంటారు. గ్రంథాలలో దుర్మూహుర్తమును మాత్రమే చెప్పారు. రాహుకాలంను గూర్చి చెప్పినట్లుగా లేదు. రాహు కాలమును తమిళులు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. మన ప్రాంతమున వర్జ్యము, దుర్మూహూర్తమును పాటిస్తే సరిపోతుంది.

దుర్ముహూర్తం వారమునకు సంబంధించిన దోషము. ఇది సూర్యోదయము 6 గంటలకయ్యేటప్పుడు దుర్మహూర్తం ఈ విధముగా వచ్చును. దీని ప్రమాణం 48 నిమిషాలు, ఆదివారం సాయంత్రము 4-32కు. సోమవారం మధ్యాహ్నం 12-28 మరల 2-58కు మంగళవారం ఉదయం 8-30కు, మరల రాత్రి 11-50కు, బుధ వారం ఉదయం 11-41కు, గురువారం మధ్యాహ్నం 2-54కు, శుక్రవారం మధ్యాహ్నం 12-28కు శనివారం ఉదయం 2-40కు దుర్మహూర్తం వచ్చుచుండును. ఘడియల్లో ఆది-26, సోమ-16, 22 మంగళ-6 మరల రాత్రి 11-50 బుధవారం-11ఘ, గురువారం-10, శుక్ర-16 శని-4 ఘడియలకు వచ్చును.

పంచకరహితము
ముహూర్తం ఏర్పరచుకొను నాటికి తిధి, వార, నక్షత్ర లగ్న సంఖ్యలను కలిపిన మొత్తమును 9చేత భాగించగా శేషము 3-5-7-9 ఉన్న ముహూర్తములు రహితమైనవని గ్రహించాలి. 1 మిగిలిన మృత్యు పంచకం అగ్నిపంచకం, 4 రాజపంచకం, 6 చోరపంచకం, 8 రోగపంచకం ఇవి దోషకరమైనవి.

శూన్యమాసము
శూన్యమాసములో ఎటువంటి శుభకార్యం చేయరాదు. శూన్యమాసం, ఆషాఢం, భాద్రపదము, పుష్యం.. ఇవికాక మీన, చైత్రము, మిధునాషాఢము, కన్యాభాద్రపదము, ధనుఃపుష్యము. ఇవి శూన్యమాసములే సూర్యుడు ఆయా రాసులలో ఉన్నప్పడు శుభకార్యముల గూర్చి తలపెట్టరాదు.

మూఢము లేక మౌఢ్యమి
రవితో కలసి గురు శుక్రులలో ఎవరైనను చరించు వేళను మూఢమందురు. అస్తంగత్వ దోషము ప్రాప్తించుటతో శుభమీయజాలని కాలమిది. కాబట్టి ఎలాంటి శుభకార్యములైనను ఈ కాలములో జరుపరాదు.

కర్తరి – ఏయే కార్యములయందు జరిగించరాదు ?
కర్తరి అనగా సూర్యుడు భరణి 4పాదమున కృత్తిక 4వ పాదములలోను, రోహిణి 1వ పాదమున సంచరించు కాలమును కర్తరి అంటారు. భరణీ 4వపాదము డొల్లకర్తరి అంత చెడ్డదికాదు. మిగతా కాలమంతయు చాలా చెడ్డది. గృహనిర్మాణాది కార్యములు, నుయ్యి త్రవ్వట, దేవతా ప్రతిష్ట మొదలగు ఈ కాలంలో చేయరాదు.

త్రిజ్యేష్ట విచారణ
తొలుచూలు వరుడు, తొలిచూలు కన్యక జ్యోష్ట మాసం వీటి మూడింటిని త్రిజ్యేష్ట అని అంటారు. వీనిలో ఒక జ్యేష్టం శుభకరం. రెండు జ్యేష్టములు మధ్యమం. మూడు జ్యేష్టములు హానీ. కాని తొలిచూలు వరకు ద్వితీయాది గర్భజాతయగు కన్యను తొలిచూలు కన్య ద్వితీయాది గర్భజాతకుడగు వరుని పెళ్లాడినప్పుడు జ్యేష్టమాసం శుభకరమైందే…మీ..చింతా గోపి శర్మ సిద్ధాంతి★భువనేశ్వరి పీఠం★పెద్దాపురం-533437, సెల్:- 9866193557